Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సిమ్ యాక్టివేట్ కావడంలేదు మహాప్రభో... నాకు 40 రోజుల తర్వాత అయ్యింది... ఇక నీ సంగతేంటి?

జియో సిమ్... ఫ్రీ డేటా... డిసెంబరు 31 వరకూ హ్యాపీ యూజ్. ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడం... చూసుకోవడమే. ఈ జియో సిమ్ కొందరికి బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోతోంది. కానీ మరికొందరికి మాత్రం చేదు అనుభవాన్ని మిగుల్చుతోంది. జియో సిమ్ తీసుకుని ఫోనులో వేసుకున్న తర్వాత నా

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (15:25 IST)
జియో సిమ్... ఫ్రీ డేటా... డిసెంబరు 31 వరకూ హ్యాపీ యూజ్. ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడం... చూసుకోవడమే. ఈ జియో సిమ్ కొందరికి బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోతోంది. కానీ మరికొందరికి మాత్రం చేదు అనుభవాన్ని మిగుల్చుతోంది. జియో సిమ్ తీసుకుని ఫోనులో వేసుకున్న తర్వాత నాలుగైదు గంటల్లో యాక్టివేట్ అవుతుందని చెపుతున్నారు. కానీ కొందరికి గంటలే కాదు రోజులు, వారాలు గడిచిపోయినా సిమ్ మాత్రం యాక్టివేట్ కావడంలేదు. దీనితో కొందరు యూజర్లు రిలయన్స్ సిమ్ పంపిణీ చేస్తున్న కేంద్రాల వద్ద మరో కొత్త సిమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్లు చెప్పే ఫిర్యాదుల్లో ఒకతను నా సిమ్ తీసుకుని వారం రోజులయ్యింది యాక్టివేట్ కాలేదని చెపుతుంటే మరొకతను... నాకు 40 రోజుల తర్వాత యాక్టివేట్ అయ్యింది... ఇక నీ సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నాడు. మొత్తానికి జియో సిమ్ కోసం జనం రోజూ బారులుతీరి ఉంటున్నారు. 
 
జియో సిమ్ కోడ్ జ‌న‌రేట్ కావడం లేదా? ఇలా చేయండి చాలు....
జియో సిమ్ తీసుకోవటానికి కోడ్ జ‌న‌రేట్ చేయాలి. కోడ్ లేకుండా సిమ్ తీసుకోవటం కుదరదు. కాని చాలామందికి కోడ్ స‌రిగా జ‌నరేట్ అవటం లేదు. ఎందుకు కోడ్ generate అవటం లేదు? మై జియో యాప్‌ను ఇన్స్టాల్ చేయటం ద్వారా గతంలో చాలామంది అఫీషియల్‌గా కంపెనీ సపోర్ట్ చేయని 4జి ఫోనులపై కూడా కోడ్ జ‌న‌రేట్ చేసుకొని సిమ్ తీసుకున్నారు. అందుకే కంపెని వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేసి బ‌గ్ సాల్వ్ చేసి ఫోన్ ట్రాకింగ్‌ను కష్టం చేసింది. అందుకే ప్లే స్టోర్‌లో ప్రస్తుతం ఉన్న మై జియో యాప్‌ను మీ ఫోన్‌ను సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతుంది.
 
మరి దీనికి ప‌రిష్కారం ఎలా? 
ప్లే స్టోర్లో ఉన్న అప్‌డేటెడ్ మై జియో యాప్ వెర్షన్ కాకుండా గతంలో అందరికీ ఈజీగా కోడ్ జ‌న‌రేట్ చేసిన ఓల్డ్ వెర్షన్ మై జియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వాడాలి. ఈ లింక్ (MyJio 3.2.05 version) నుండి డౌన్లోడ్ చేయగలరు
 
ఇప్పుడు ఫోన్ మెయిన్ సెట్టింగ్స్‌లో ఉన్న సెక్యూరిటీ ఆప్షన్‌లోకి వెళ్తే అన్ నోన్ సోర్సెస్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎనేబుల్ చేసి apk ఫైల్‌ను ఫోన్‌లో ఎక్కడ డౌన్లోడ్ చేశారో అక్కడకు వెళ్లి (డౌన్ లోడ్స్ ఫోల్డర్‌లో ఉంటుంది) apk మీద క్లిక్ చేస్తే యాప్‌ను ఇన్స్టాల్ చేయగలరు. లేదంటే మీరు విడిగా apk ఫైల్‌ను ఇన్స్టాల్ చేయగలరు.
 
అయితే ఓల్డ్ వెర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసినంత మాత్రం కోడ్ జ‌న‌రేట్ అవ్వదు. కింద చెప్పిన స్టెప్స్‌ను జాగ్రత్తగా ఫాలో అయితే కోడ్ జ‌న‌రేట్  అవుతుంది. కింద తెలిపిన ప్రాసెస్ 3G ఫోనులో కూడా పనిచేస్తుంది.
 
ముందుగా మీరు ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకున్న లేటెస్ట్ మై జియో యాప్ మరియు ఇతర అన్ని జియో యాప్స్‌ను uninstall చేయాలి.
ఫోన్‌లో WiFi లేదా మొబైల్ ఇంటర్నెట్ అనేవి ఆన్ అయ్యి ఉండకూడదు. ఆఫ్ చేసి పెట్టండి.
ఇప్పుడు ముందుగా డౌన్లోడ్ చేసిన apk ఫైల్(లింక్)ను ఇన్స్టాల్ చేయాలి.
యాప్ ఇంస్టాల్ చేసిన తరువాత ఓపెన్ చేయకుండా ఫోన్ రిస్టార్ట్ చేయాలి.
ఫోన్ ఆన్ అయిన తరువాత ఇంటర్నెట్ ఆఫ్‌లో ఉండగానే My Jio యాప్ ఓపెన్ చేయండి.
మీకు ఎప్పుడూ కనిపించే Welcome to your digital life అనే స్క్రీన్ కనిపిస్తుంది. కాని కొత్తగా ఇప్పుడు దాని క్రింద Get Jio Sim అనే మెసేజ్ ఉంటుంది.
ఇప్పుడు ఫోన్ యొక్క హోమ్ బటన్ ప్రెస్ చేసి ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫోన్లో మొబైల్ ఇంటర్నెట్(WiFi కాదు)ను ఆన్ చేయండి.
వెంటనే మరలా బ్యాక్ గ్రౌండ్‌లో రీసెంట్ యాప్స్ లిస్టులో రన్ అవుతున్న Jio యాప్‌ను ఓపెన్ చేసి Get Jio Sim పైన క్లిక్ చేయండి.
Next  స్క్రీన్‌లో మీకు Agree and Continue అనే మెసేజ్ వస్తుంది. దాని పైన క్లిక్ చేయాలి.
ఇక ఇక్కడ నుండి మీరు యాప్‌లో వచ్చే instructions ఫాలో అయితే మీకు కోడ్ వస్తుంది. Jio యాప్స్ అన్నీ కూడా ఇంస్టాల్ చేయాలి. కోడ్‌ను స్క్రీన్ షాట్ (పవర్ బటన్ మరియు వాల్యూం ప్లస్ బటన్ ఒకేసారి ప్రెస్ చేసి) తీసి పెట్టుకోవటం మంచిది.
అంతే! ఇదే కోడ్‌ను పట్టుకొని, ఆధార్ కార్డ్ ఒరిజినల్ మరియు xerox ను తీసుకోని స్టోర్‌కు వెళ్లి సిమ్ అడిగితే సిమ్ ఇస్తారు.
పైన చెప్పినది పనిచేయకపోతే క్రింద అదే ప్రోసెస్‌ను వేరే స్టెప్స్‌తో చేయండి…
 
ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్న Jio యాప్‌ను uninstall చేయండి ముందు.
ప్లే స్టోర్ నుండి మళ్ళీ అదే యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి.
ఓపెన్ చేసి Install All బటన్ పైన క్లిక్ చేయగలరు ఇప్పుడు. అన్ని Jio యాప్స్ ఇంస్టాల్ చేసేసి యాప్‌ను close చేయండి (రీసెంట్ యాప్స్ లిస్టు నుండి కూడా).
ఇప్పుడు ఫోన్ లోని WiFi అండ్ మొబైల్ ఇంటర్నట్ రెండూ ఆఫ్ చేసేయాలి.
మరలా My Jio యాప్‌ను ఓపెన్ చేయండి. మీకు ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు అని చెబుతుంది స్క్రీన్ పై.
కాని ఆ మెసేజ్‌ను పట్టించుకోకండి. వెంటనే మీకు Get Jio సిమ్ అనే బటన్ కూడా కనిపిస్తుంది.
ఇప్పుడు దానిపై క్లిక్ చేయండి. మరలా ఇంటర్నెట్ లేదు అని మెసేజ్ వస్తుంది.
ఇప్పుడు మీరు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి WiFi లేదా మొబైల్ ఇంటర్నెట్‌ను ఆన్ చేసి మరలా రీసెంట్ యాప్స్ లిస్టులో ఉన్న My Jio యాప్‌ను ఓపెన్ చేసి Get Jio sim బటన్ పైన ప్రెస్ చేస్తే మీకు కోడ్ generate అయ్యే ముందు ఉండే agree and get Jio Offer స్క్రీన్ కనిపిస్తుంది. next స్క్రీన్ లో కోడ్ generate చేసుకోవటమే. అంతే!
అయితే ఈ ప్రోసెస్ రెడ్మి నోట్ 3, Mi మాక్స్, oneplus వంటి ఫోనులపై సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తుంది అని రిపోర్ట్స్. కాని ఆపిల్ ఫోనులపై సక్సెస్ రేట్ తక్కువుగా ఉంది. ట్రై చేయండి మరి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments