Webdunia - Bharat's app for daily news and videos

Install App

18న 5జీ హానర్ వీ40 స్మార్ట్ ఫోన్ విడుదల..

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (19:32 IST)
Honor V40
హానర్ నుంచి ఈ నెల 18వ తేదీన హానర్ వీ40 స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ మొదట చైనాలో లాంచ్ కానుంది. మిగతా దేశాల్లో లాంచ్ చేస్తుందా లేదా అనే విషయాన్ని హానర్ ఇంకా వెల్లడించలేదు. హానర్ ఈ విషయాన్ని తన అధికారిక వీబో హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. 
 
దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. దీని బట్టి ఈ ఫోన్ కర్వ్‌డ్ డిస్ ప్లేతో రానుంది. ఇందులో డ్యుయల్ పంచ్ హోల్ కెమెరాలు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. 
 
అయితే ఈ లీకులు నిజమో కాదో తెలియాలంటే మాత్రం జనవరి 18వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇందులో 6.72 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. ఈ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గానూ ఉండే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌పై హానర్ వీ40 పనిచేయనుంది. ఇందులో 5జీ ఫీచర్‌ను కూడా అందించనున్నారు. 
 
ఈ ఫోనులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత మ్యాజిక్ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే అవకాశం ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ లేదా 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. 
 
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లు ఇందులో ఉండనున్నాయి. ఇక ముందువైపు రెండు సెల్పీ కెమెరాలు అందించనున్నారు. 32 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్ సెన్సార్లు ఇందులో ఉండనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments