హానర్ 10 లైట్ కొత్త స్మార్ట్ ఫోన్.. 15 నుంచి ఫ్లిఫ్‌కార్టులో మాత్రమే...

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (13:01 IST)
మొబైల్ తయారీ సంస్థ హానర్ నుంచి హానర్ 10 లైట్ విడుదల కానుంది. ఈ నెల 15వ తేదీ సంక్రాంతికి కానుకగా ఫ్లిఫ్ కార్ట్‌లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీంతో హానర్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల కోసం ప్రత్యేక పేజీని కేటాయించింది. గ్రీన్ 710- ఎస్.ఓ.సీలో పనిచేసే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్, 24 మెగాపిక్సల్ కెమెరా, గ్రాడియంట్ బ్యాక్ ప్యానల్‌ను కలిగివుంటుంది.
 
ఫ్లిఫ్ కార్ట్‌లో మాత్రమే హానర్ స్మార్ట్ ఫోన్... స్కై బ్లూతో పాటు బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో లభ్యమవుతుంది. ఇప్పటికే చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది నవంబర్‌లో విడుదల చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ 4జీ రామ్, 64 జీబీ సామర్థ్యంతో రూ.14వేలకు విక్రయించబడుతోంది. ఇంకా 6జీబీ రామ్, 64జీబీ సామర్థ్యం కలిగిన ఈ హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో రూ.17,500వేల ధర పలుకుతోంది. 
 
అలాగే 6జీబీ రామ్, 128జీబీ సామర్థ్యం కలిగిన హానర్ ఫోన్.. రూ.19,500 పలుకుతుందని హానర్ సంస్థ ప్రకటించింది. భారత్‌లోనూ హానర్ ఫోన్ ఇదే రేటు పలికే అవకాశం వుంది. ఈ హానర్ 10 లైట్ ఆండ్రాయిడ్ 9.0 పైలో పనిచేస్తుంది. ఫుల్ హెచ్డీని ఉపయోగించుకోవచ్చు. ఇంకా 24 మెగాపిక్సల్ కెమెరాతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పనిచేస్తుందని హానర్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments