నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నీట్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్ ఎండీఎస్ పరీక్షలను డిసెంబర్ 14వ తేదీన నిర్వహించింది. ఈ పరీక్షలు ఎమ్డీ, ఎమ్ఎస్, పీజీ డిప్లొమా కోర్సుల కోసం నిర్ణయించబడింది. ఈ నీట్ పరీక్షల ఫలితాలు జనవరి 6, 2019న విడుదల కానున్నాయి. నీట్ ఎండీఎస్, నీట్ పీజీ ర్యాంకులు పీజీ మెడికల్ అండ్ డెంటల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులకు ఉపకరిస్తాయి.
ఆల్ ఇండియా 50శాతం కోటా సీట్లు (అన్నీ రాష్ట్రాలు జమ్మూ- కాశ్మీర్ మినహా), రాష్ట్ర కోటా సీట్లు (జమ్మూకాశ్మీర్‌తో సహా) దేశంలోని అన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులకు ఈ ర్యాంకులు పనికొస్తాయి. నీట్ ఎండీఎస్ 2019 ఫలితాలు మాత్రం జనవరి 15, 2019న విడుదల కానున్నాయి. ఇంకా నీట్ పీజీ 2019 పరీక్షా ఫలితాలు జనవరి 31, 1019న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.