Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రామ్‌లో ఐటీ కంపెనీలకు మరో మూడు నెలలు తాళాలు

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (12:43 IST)
హర్యానా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకున్న హర్యానా.. ఇపుడు ఐటీ కంపెనీలు మరో మూడు నెలల పాటు కార్యకలాపాలు కొనసాగించేందుకు వీల్లేదంటూ ఆదేశాలు జారీచేసింది. అంటే.. జూలై 31వ తేదీ వరకు ఐటీ కంపెనీలు తెరిచేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. అదేసమయంలో వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
గురుగ్రామ్‌లో అనేక మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలు ఉన్నాయి. కరోనా వైరస్ దెబ్బ అన్ని ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. కానీ, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులు ఇవ్వాలని హర్యానా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 
 
నగరంలోని ఎంఎన్సీలు, బీపీఓలు, ఐటీ ఈఎస్ సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీఎస్ కుందూ తెలియజేశారు. గురుగ్రామ్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, జెన్‌పాక్ట్, ఇన్ఫోసిస్ సహా ఎన్నో కంపెనీలున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలూ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నాయి. 
 
ఇక్కడి కొన్ని కంపెనీలు పీపీఈ కిట్లను, మాస్క్‌లను కూడా తయారు చేస్తున్నాయి. అయితే, గురుగ్రామ్‌లోని ఆటో మొబైల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో 51 మందికి కరోనా సోకడంతో, ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా గుర్తించిన అధికారులు, నిబంధనలను కఠినం చేశారు. ముఖ్యంగా నుహ్, ఫరీదాబాద్, పాల్వాల్ ప్రాంతంలో పరిశ్రమలను తెరిచేందుకు ఇంకా అనుమతి లభించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments