Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూత‌న ఐటీ నిబంధ‌న‌ల‌ు.. దిగివచ్చిన ఐటీ సంస్థలు

Webdunia
శనివారం, 29 మే 2021 (11:27 IST)
కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా అమ‌లులోకి తెచ్చిన నూత‌న ఐటీ నిబంధ‌న‌ల‌పై టెక్ కం సోష‌ల్ మీడియా దిగ్గ‌జాలు దిగి వ‌చ్చాయి. ఈ నిబంధ‌న‌ల అమ‌లుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కేంద్ర ఐటీ మంత్రిత్వ‌శాఖ‌కు గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్ వివ‌రాల‌తో కూడిన నివేదిక స‌మ‌ర్పించారు. అయితే.. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్.. ఈ నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల సమాచారం. 
 
ఇప్ప‌టి వ‌ర‌కు ఐటీ నిబంధ‌న‌ల అమ‌లుకు ఒక అధికారిని నియ‌మించిన వివ‌రాల‌ను ట్విట్ట‌ర్ త‌మ‌కు స‌మ‌ర్పించ‌లేద‌ని ఐటీ శాఖ అధికార వ‌ర్గాలు తెలిపాయి. అయితే, ఒక న్యాయ‌వాదిని ఫిర్యాదుల అధికారిగా పేర్కొన్న‌ద‌ని స‌మాచారం.
 
ఐటీ నిబంధ‌న‌ల అమ‌లుకు తీసుకోకున్న చ‌ర్య‌ల‌పై నివేదిక స‌మ‌ర్పించాల‌ని అన్ని సోష‌ల్ మీడియా వేదిక‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కోరింది. ఈ నెల 25 నుంచి నూత‌న ఐటీ నిబంధ‌న‌లు అమ‌లులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
 
నూత‌న ఐటీ నిబంధ‌న‌లు ప్ర‌జ‌ల భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించి వేస్తాయ‌ని ట్విట్ట‌ర్ గురువారం ఆరోపించింది. అలాగే త‌మ సిబ్బంది సేఫ్టీకి ముప్పు ఉంద‌ని, వారిపై జ‌రిమానాలు విధించే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
 
ట్విట్ట‌ర్ ఆరోప‌ణ‌లు చేసిన కొన్ని గంట‌ల్లోనే కేంద్రం ఘాటుగా స్పందించింది. కేంద్ర చ‌ట్టాల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌క్కువ చేసి చూపుతుంద‌ని, త‌మ‌కే పాఠాలు చెప్పేందుకు ట్విట్ట‌ర్ ప్ర‌య‌త్నిస్తుంద‌ని మండి ప‌డింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments