Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 11 యాప్‌లలో జోకర్ మాల్‌వేర్... డిలీట్ చేయమంటున్న గూగుల్

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (11:37 IST)
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ విజ్ఞప్తి చేసింది. గూగుల్ ప్లే స్టేర్‌లో జోకర్ మాల్‌వేర్ చొరబడిందని హెచ్చరించింది. ముఖ్యంగా ప్లే స్టోర్‌లోని 11 యాప్‌లలో ఈ వైరస్ సోకినట్టు తెలిపింది. అందువల్ల ఆ 11 యాప్‌లను తక్షణం డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. 
 
ఈ అత్యంత ప్రమాదకరమైన జోకర్ మాల్ వేర్‌ను గత సంవత్సరం చివర్లో గుర్తించామని, ఇది ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. ఇది యాప్స్‌లో దాగుండి, స్మార్ట్ ఫోన్లలోకి ఇతర వైరస్‌లను ఎవరి ప్రమేయం లేకుండానే డౌన్‌లోడ్ చేస్తోందని, దీని కారణంగా ఎన్నో ప్రీమియం యాప్స్ ప్రమాదంలో పడ్డాయని గూగుల్ తెలిపింది.
 
మొత్తం 11 యాప్‌లను తాము డిలీట్ చేశామని చెబుతూ, వాటిల్లో ఇమేజ్ కంప్రెస్, రిలాక్సేషన్, యాండ్రాయిడ్ ఎస్ఎంఎస్, చెర్రీ, సెండ్ ఎస్ఎంఎస్, లవింగ్ లవ్ మెసేజ్, విత్ మీ, హెచ్ఎం వాయిస్, ఫ్రెండ్స్ ఎస్ఎంఎస్, రికవరీ ఫైల్స్, ఎల్ ప్లాకర్, రిమైండ్ మీ, మెమొరీ గేమ్ ట్రయినింగ్ తదితరాలు ఉన్నాయని వెల్లడించింది.
 
కాగా, తనను గుర్తించకుండా ఉండేందుకు ఈ వైరస్ పాత టెక్నిక్‌లను వినియోగిస్తోందని, రెండు మార్గాల ద్వారా స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోందని రీసెర్చర్లు వెల్లడించారు. ప్లే స్టోర్ సెక్యూరిటీని దాటి మరీ ఇది యాప్స్‌కు పట్టుకుందన్నారు. 
 
ఈ వైరస్‌ను తయారు చేసిన వారు దాని కోడ్‌ను తగ్గించారని, అది కూడా 'డెక్స్' ఫైల్ రూపంలో ఉండి, గుర్తించేందుకు క్లిష్టతరంగా మారిందని వివరించింది. అందువల్ల ఎవరిఫోన్లలోనైనా ఆ 11 యాప్స్ ఉంటే తక్షణం డిలీట్ చేయాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments