Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ఎయిర్‌టెల్ 5 GBతో షాక్... అర్థరాత్రి 12 గంటల నుంచి 6 గంటల వరకూ ఆడుకోండి...

టెలిఫోన్ సేవల ప్రొవైడర్ల మధ్య పోటీ తారాస్థాయికి వెళుతోంది. జియోతో ముఖేష్ అంబానీ ఎయిర్ టెల్, వొడాఫోన్ తదితర సర్వీస్ ప్రొవైడర్లకు మైండ్ బ్లాక్ చేయడంతో ఇప్పుడా సర్వీస్ ప్రొవైడర్లు కసి తీర్చుకునేందుకు సిద

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (15:33 IST)
టెలిఫోన్ సేవల ప్రొవైడర్ల మధ్య పోటీ తారాస్థాయికి వెళుతోంది. జియోతో ముఖేష్ అంబానీ ఎయిర్ టెల్, వొడాఫోన్ తదితర సర్వీస్ ప్రొవైడర్లకు మైండ్ బ్లాక్ చేయడంతో ఇప్పుడా సర్వీస్ ప్రొవైడర్లు కసి తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఎయిర్ టెల్ భారీ ఆఫర్ ప్రకటించి జియోకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టింది.
 
ఇందులో భాగంగా ప్రీపెయిడ్ వినియోదాగదారుల కోసం ఎయిర్టెల్ 5 జీబీ ఇంటర్నెట్ డాటా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించి తన వినియోగదారులు జారిపోకుండా ఉండేందుకు తంటాలు పడుతోంది. ఈ సేవను ఉపయోగించుకునేందుకు  airtel.in/free?icid=home_jackpot_row_4_column_1 లింకును తమతమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలి. 
 
ఇలా చేసిన తర్వాత ‘జాక్ పాట్’ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే లింక్ అయిపోతారు. ఐతే ఈ ఉచిత డేటా ఆఫర్ అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరి అర్థరాత్రి వేళ వినియోగదారులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని వినియోగించుకోవాలేమో...?

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments