Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఐఐటీ విద్యార్థులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్న వానరాలు

ముంబై ఐఐటీ క్యాంపస్‌ విద్యార్థులంతా భయాందోళనల్లో వణికిపోతున్నారు. వారి హాస్టళ్లపై గత కొద్దిరోజులుగా పదిహేను వానరాలు ప్రవేశించి నానా విధ్వంసం సృష్టించి విద్యార్థుల్ని భయపెడుతున్నాయి. వాటి అరుపులు కేకలత

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (15:25 IST)
ముంబై ఐఐటీ క్యాంపస్‌ విద్యార్థులంతా భయాందోళనల్లో వణికిపోతున్నారు. వారి హాస్టళ్లపై గత కొద్దిరోజులుగా పదిహేను వానరాలు ప్రవేశించి నానా విధ్వంసం సృష్టించి విద్యార్థుల్ని భయపెడుతున్నాయి. వాటి అరుపులు కేకలతో క్యాంపస్‌లోని ఉండే విద్యార్థులు కనీసం నిద్రపోలేకపోతున్నారు. విద్యార్థుల ఆహార పదార్థాలు, దుస్తులే కాకుండా, విలువైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా లాక్కుపోతున్నాయి. 
 
రోజు రోజుకీ కోతుల సంఖ్యా పెరుగుతూ వస్తోంది. వాటి ఆగడాలను భరించలేకపోతున్నామని విద్యార్థులు తమ సమస్యను ఆన్‌లైన్‌ క్యాంపస్‌ మ్యాగజైన్‌ 'ఇన్‌సైట్' ద్వారా బయటపెట్టారు. కాగా, ముంబై ఐఐటీ క్యాంపస్ ప్రాంగణం చుట్టూ అటవీ ప్రాంతం ఉన్నందున కోతుల సమస్య అధికంగా ఉందని, వస్తువులన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకోవాలని, ఏ వస్తువునూ బయటపెట్టకుండా హాస్టల్ గదుల్లో ఉంచుకోవాలని కళాశాల డీన్ సౌమ్యా ముఖర్జీ వెల్లడించారు. అంతేకాకుండా కోతులను తరిమి కొట్టేందుకు టపాకాయలు పేల్చమని విద్యార్థులకు సూచించారు. వానరాలను తరిమికొట్టేందుకు నిపుణుల సహాయంతో చర్యలు చేపడతామని సౌమ్య తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments