Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.10వేలు జరిమానా (video)

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (20:39 IST)
పా న్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.10వేల జరిమానా విధించేందుకు రంగం సిద్ధం అవుతోంది. పాన్ ఆధార్ లింక్ చేయాలని ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ ఈ నెల 30వ తేదీ వరకు గడువు విధించింది. పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తే.. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తుంది. అయితే ఈ రెండు కార్డులను కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలిని అధికారులు సూచిస్తున్నారు.
 
కేంద్ర ప్రభుత్వం మరోసారి పాన్, ఆధార్ అనుసంధాన గడువును పొడిగించింది. ఇప్పటికే గడువు చాలా సార్లు పొడిగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్‌కు జూన్ 30 డెడ్‌లైన్‌గా ఉందన్నారు. ఈలోపు రెండింటినీ లింక్ చేసుకోవాలి. పాన్, ఆధార్ అనుసంధానానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
 
ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు వెళ్లి పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేసుకోవచ్చు. నిర్ణీత గడువులోగా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేసుకోకపోతే.. పాన్ నెంబర్ పని చేయదు. తర్వాత ఆదాయపు పన్ను శాఖ నుంచి సమస్యలు వస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ సెక్షన్ కింద రూ.10,000 జరిమానా ఎదుర్కోవలసి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments