Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్లిప్ కార్ట్ భారీ డీల్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్... స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్ కొనుగోళ్లలో గట్టిపోటీనిస్తున్న స్నాపీడీల్‌ను సొంతం చేసుకునేందుకు 850 మిలియన్ డాలర్ల భ

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (16:28 IST)
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్... స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్ కొనుగోళ్లలో గట్టిపోటీనిస్తున్న స్నాపీడీల్‌ను సొంతం చేసుకునేందుకు 850 మిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. ఇందులో 650-700 డాల‌ర్ల‌ను వెంట‌నే చెల్లించేందుకు కూడా ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధ‌ప‌డింది. ఈ ఆఫ‌ర్‌కు ఓకే చెప్ప‌డానికి స్నాప్‌డీల్ కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 
 
ఈ డీల్ కుదిరితే.. స్నాప్‌డీల్‌కు చెందిన ఈ-కామ‌ర్స్ బిజినెస్ మొత్తం ఫ్లిప్‌కార్ట్ కైవసం చేసుకున్నట్లవుతుంది. స్నాప్‌డీల్ వారి ఫ్రీఛార్జ్‌, వుల్క‌న్ ఎక్స్‌ప్రెస్‌లు ఈ ఒప్పందంలో భాగం కాదు. ఈ ఆఫ‌ర్ గురించి చ‌ర్చించేందుకు స్నాప్‌డీల్ యాజ‌మాన్యం త‌మ షేర్ హోల్డ‌ర్ల‌తో స‌మావేశం కానున్నట్లు సమాచారం. అమేజాన్ సంస్థకు గట్టిపోటీనిచ్చేందుకు స్నాప్‌డీల్‌ను కలుపుకోవాలని ఫ్లిఫ్‌కార్ట్ ప్రయత్నిస్తోంది. ఇంకో పది రోజుల్లో ఈ డీల్ కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments