Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రావెల్స్ నడుపుతున్నారు.. అతి చేస్తే బస్సు ఎక్కనిస్తారా?: జేసీని నిలదీసిన కోర్టు

ఏపీలో అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. విమానయాన సంస్థలు తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ఆయన ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అక్

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (16:13 IST)
ఏపీలో అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. విమానయాన సంస్థలు తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ఆయన ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నతో దిమ్మతిరిగిపోయారు.
 
ఇటీవల విశాఖపట్టణంలో ఎయిర్‌పోర్టు సిబ్బందితో జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ప్రింటర్‌ను ఎత్తి కిందపడేసేందుకు పూనుకున్నారు. దీంతో ఆయనపై ఎయిర్‌లైన్స్ సంస్థలన్నీ నిషేధం విధించాయి. 
 
ఈనేపథ్యంలో సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో జేసీ వెళ్లాల్సి వచ్చింది. ఓటు వేసిన తర్వాత తనపై విమానయాన సంస్థలు విధించిన నిషేధంపై జైట్లీతో జేసీ దివాకర్ రెడ్డి చర్చించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జైట్లీ సూచించారు. 
 
అయితే, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని... నిషేధాన్ని రద్దు చేయాలని కోరుతూ హైద్రాబాద్ హైకోర్టును జేసీ ఆశ్రయించగా, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. నిషేధాన్ని రద్దు చేయలేమని కోర్టు స్పష్టంచేసింది.
 
'మీరు జేసీ కూడా ట్రావెల్స్ నడుపుతున్నారు కదా... భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిని బస్సులో ప్రయాణించడానికి అనుమతిస్తారా' అంటూ కోర్టు ప్రశ్నించింది. అయితే ఈ వ్యవహారంపై ఎయిర్‌లైన్స్ సంస్థలకు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసు మళ్లీ విచారణకొచ్చే 21వ తేదీలోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

చిరంజీవిగారు జపాన్ వెళ్లారు. రాగానే జీబ్రా చూస్తారు : హీరో సత్యదేవ్

రాజకీయనాయకుల బిల్డప్ షాట్ లు ఎలా వుంటాయో చెప్పిన కె.సి.ఆర్. రాకింగ్ రాకేష్

ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మురారి ఫీలింగ్ వచ్చింది : అశోక్ గల్లా

పెళ్లి చూపులు టైంలో ఈ స్థాయికి వస్తామనుకోలేదు : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments