Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిప్‌కార్ట్‌లో కిరణా సరుకులు.. ఆన్‌లైన్ ఫర్నీచర్ అమ్మకాల్లో మార్పులు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఇకపై ఆన్‌లైన్‌లో కిరాణా సరుకులను విక్రయించనుంది. వీటి విక్రయాలను వచ్చే యేడాది నుంచి అమ్మనున్నట్టు ప్రకటించింది.

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (14:50 IST)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఇకపై ఆన్‌లైన్‌లో కిరాణా సరుకులను విక్రయించనుంది. వీటి విక్రయాలను వచ్చే యేడాది నుంచి అమ్మనున్నట్టు ప్రకటించింది. 
 
ఇదే అంశంపై ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిన్నీ బన్సల్ స్పందిస్తూ వచ్చే యేడాది నుంచి ఎంపిక చేసిన ముఖ్య నగరాల్లో నిత్యావసర సరుకులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇప్పటికే అమెజాన్‌ భారతదేశంలోని కొన్ని ముఖ్య నగరాల్లో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. 
 
అలాగే, తాము కూడా వచ్చే ఏడాది ఫ్లిప్‌కార్ట్‌ మొదట ప్రయోగాత్మకంగా అమలు చేసి.. వచ్చే మూడేళ్ళలో పూర్తిగా స్థాయిలో విస్తరించనున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్‌లో సరుకులు అమ్మటం కొంచెం కష్టమే అయినా అది లాభదాయకమే అని అభిప్రాయపడ్డారు.
 
ఇటీవల కాలంలో దాదాపు 1.2 బిలియన్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఫోన్లు, బట్టలు వంటివి ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారని, వీరి సంఖ్య క్రమేణా పెరుగుతోందని అన్నారు.
 
భారత్‌లో ఆన్‌లైన్‌ అమ్మకాలు 2025 కల్లా ఇప్పుడున్న దానికి పది రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ ఆన్‌లైన్‌ అంగడిగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్‌ పెద్ద ఎత్తున తన మార్కెట్‌ని విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments