Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాదర్స్ డే సందర్భంగా వాట్సాప్ యూజర్లకు చక్కని ఛాన్స్.. ఏంటది?

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (18:38 IST)
ఇన్‌స్టంట్ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ వినియోగదారులకు చక్కని అవకాశం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫాదర్స్‌ డే సందర‍్భంగా యూజర్ల సౌలభ్యం కోసం 'పాపా మేరే పాపా' పేరుతో కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. 
 
బాలీవుడ్‌ మూవీ ' మై ఐసా హీ హూం'' లోని పాపులర్‌ సాంగ్‌ 'పాపా మేరే పాపా' ప్రేరణతోనే దీన్ని తీసుకొచ్చింది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్‌లో స్టిక్కర్ ప్యాక్ అందుబాటులో ఉంది. స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
 
మొదట భారత్‌, ఇండోనేషియాలో లాంచ్‌ చేసినా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్, వాబేటా ఇన్ఫో ఈ ప్యాక్ గురించి నివేదించింది. ఈ క్రమంలో లవ్ అండ్ ప్రైడ్ స్టిక్కర్ ప్యాక్‌ను, అదేవిధంగా మదర్స్ డే స్టిక్కర్లను కూడా విడుదల చేసింది. 
 
వ్యక్తిగత చాట్ విండో లేదా గ్రూప్ చాట్ విండోను ఓపెన్‌ చేయండి. కొత్త స్టిక్కర్ విభాగాన్ని బ్రౌజ్ చేసేందుకు స్టిక్కర్స్ మెనులో ప్లస్ చిహ్నంపై ప్రెస్‌ చేస్తే తాజా స్టిక్కర్ ప్యాక్ పైన కనిపిస్తుంది. దాంట్లోంచి ఇష్టమైన ఎమోజీని డౌన్‌ లోడ్‌ చేస్కోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments