శాటిలైట్‌ను ప్రయోగించనున్న ఫేస్‌బుక్.. ఇక సిగ్నల్స్ బాధ వుండదట..
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే శాటిలైట్ తయారీని ప్రారంభించింది. 2019 చివరి నాటికి ఫేస్‌బుక్ శాటిలైట్‌ను ప్రయోగించాలని ఫేస్‌బుక్ లక్ష్యాన్ని నిర
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే శాటిలైట్ తయారీని ప్రారంభించింది. 2019 చివరి నాటికి ఫేస్‌బుక్ శాటిలైట్‌ను ప్రయోగించాలని ఫేస్‌బుక్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో 90 శాతం మందిని కవర్ చేసిన ఫేస్‌బుక్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త యూజర్లను పెంచుకుంటూనే సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తోంది.
తాజాగా బ్రాండ్‌బ్యాండ్‌పై ఆధారపడుకుండా.. శాటిలైట్ ద్వారా నేరుగా ఫేస్‌బుక్ కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తోంది. ఫేస్ బుక్ శాటిలైట్ పంపించాలని నిర్ణయించింది. దానికి ఎథేనా అనే పేరు పెట్టింది. ఇప్పటికే తయారీ కూడా ఆరంభించింది. ఫేస్‌బుక్ సొంత శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్ బాధ ఉండదు. ఎందుకంటే.. మారుమూల ప్రాంతాల్లోనూ ఫోన్ నుంచి నేరుగా శాటిలైట్‌కు కనెక్ట్ అయ్యి.. హ్యాపీగా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అయ్యే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఇందుకు కావాల్సిన అనుమతుల కోసం ఇప్పటికే అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్‌కు దరఖాస్తు కూడా చేసుకుంది.