Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లో టాప్ లేపిన ఎలాన్ మస్క్.. ఎలా?

ఠాగూర్
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (10:15 IST)
టెస్లా కంపెనీ అధినేత, టెక్ బిలియనీర్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన  సొంత సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్ (ఎక్స్)లో సరికొత్త రికార్డును సృష్టించారు. గురువారం నాటికి 'ఎక్స్'లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లకు చేరింది. దాంతో ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఈ మార్కును అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ట్విట్టర్ ఫ్లాట్‌ఫాంను ఎలాన్ మస్క్ గత 2022 అక్టోబరు నెలలో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, మస్క్ తర్వాత 'ఎక్స్'లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (131.9 మిలియన్లు), ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్లు) ఉండగా, ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. పాప్ గాయని రిహన్నా 108.4 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
 
ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల 100 మిలియన్ల మార్కును దాటారు. దీనిని మస్క్ కూడా ప్రశంసించారు. ప్రస్తుతం మోడీ 102.4 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇదిలావుంటే.. ప్రస్తుతం 'ఎక్స్'కి 600 మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ యాక్టివ్ యూజర్లు (ఎంఏయూలు), సుమారు 300 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు (డీఏయూలు) ఉన్నట్లు ఇటీవలే మస్క్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజు ఇకలేరు...

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments