Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెరువులో ఇల్లు.. కూల్చివేత చూస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలు, ప్రాణాల కోసం...

Hydraa

సెల్వి

, ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (21:37 IST)
Hydraa
హైడ్రా కూల్చివేత ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. హైడ్రా కూల్చివేతలలో భాగంగా సంగారెడ్డి మలక్ పూర్ చెరువు దగ్గర దూరంగా నిలబడి వీడియో తీస్తూ చూస్తున్న వ్యక్తికి ఒక రాయి ఎగిరివచ్చి తలకు బలంగా తాకగా ఒక్కసారే కిందపడి తలనుండి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సహకారంతో కూల్చేశారు. ఈ నిర్మాణం చేపట్టిన తీరు విస్మయానికి గురి చేస్తుంది. చెరువు ఒడ్డున కాకుండా ఏకంగా చెరువులోనే నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు.
 
చెరువు ఒడ్డు నుంచి బిల్డింగ్ వద్దకు చేరుకోవటానికి స్కైవాక్ తరహాలో మెట్ల నిర్మాణం చేపట్టారు.  సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ కోటీశ్వరుడు దాదాపు దశాబ్ద కాలం క్రితం ఈ బిల్డింగ్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ కూల్చివేతల్లో అపశృతి చోటుచేసుకుంది. బాంబులతో బిల్డింగ్ కూల్చేవేతలో  ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్ నుంచి అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర యాత్ర..9 రోజుల పర్యటన