Driverless car: డ్రైవర్ లెస్ కారులో శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ షికారు.. బెంగళూరు వీడియో వైరల్

సెల్వి
గురువారం, 30 అక్టోబరు 2025 (12:41 IST)
Driverless car
బెంగళూరు నగర ఆర్‌వీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు డ్రైవర్‌ అవసరం లేని కారును తయారు చేసి అదుర్స్ అనిపించుకున్నారు. విప్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన విరిన్ WIRIN (Wipro-IISc రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్) అనే డ్రైవర్‌లెస్ కారును ఇటీవల బెంగళూరులో ఆవిష్కరించారు.
 
ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ కారు లోపల కూర్చున్న వీడియో ఎక్స్‌లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆదర్శ్ హెగ్డే పోస్ట్ చేసిన ఈ వీడియోలో, స్వయంప్రతిపత్త కారు కళాశాల క్యాంపస్ అంతటా సజావుగా గ్లైడ్ చేస్తుండగా స్వామీజీ హాయిగా కూర్చున్నట్లు చూపిస్తుంది.
 
ఇది పూర్తిగా స్వదేశీ స్వీయ-డ్రైవింగ్ టెక్నాలజీ ద్వారా శక్తిని పొందుతుంది. అక్టోబర్ 27న ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఈ ప్రోటోటైప్‌ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కోసం ఆరు సంవత్సరాల పాటు ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన అధ్యాపకులు ఉత్తర కుమారి, రాజా విద్య సమన్వయంతో అధ్యాపకులు, విద్యార్థుల బృందం కష్టపడ్డారు. స్వదేశీ స్వయంప్రతిపత్తి కారును రూపొందించడం, అభివృద్ధి చేసిన కృషి ఇలా ఫలించిందని ఆర్వీ కాలేజ్ అధికారులు అంటున్నారు.  
 
ప్రాజెక్ట్ ఇంకా అభివృద్ధి చేయబడుతోంది. రాబోయే కొన్ని నెలల్లో అధికారిక ప్రయోగం జరిగే అవకాశం ఉంది. డ్రైవర్‌లెస్ కారు సిద్ధమైన తర్వాత సజావుగా మరియు సురక్షితంగా పనిచేస్తుందని నిర్ధారించుకోవడానికి పరిశోధకులు ప్రస్తుతం భారతీయ రహదారి పరిస్థితులను మ్యాప్ చేసి అధ్యయనం చేస్తున్నారని టాక్ వస్తోంది. విప్రో, భారతీయ విజ్ఞాన సంస్థ, ఆర్‌వీ ఇంజినీరింగ్‌ కళాశాల సంయుక్త భాగస్వామ్యంలో అధ్యయనం కొనసాగుతున్నట్లు సమాచారం.
 
 భారతదేశంలో మానవులు, సైకిళ్లు, ఆటోలు వెళ్లే స్వయంప్రతిపత్తి వాహనం ఉంటే, అది ఈ అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి రూపొందించారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు లేకపోవడం, గుంతలు, ప్రతిదీ యాదృచ్ఛికంగా ఉండటం వంటి వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకుని రూపొందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments