Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

Advertiesment
Couple chases biker and kills him with their car

ఐవీఆర్

, గురువారం, 30 అక్టోబరు 2025 (11:31 IST)
ఈ కాలంలో ప్రతి చిన్నదానికి ప్రాణాల్ని తీసేటంత కోపంతో రగిలిపోయేవారు ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. చిన్నచిన్న విషయాలకే హత్యలు చేసేస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి దారుణ ఘటన ఒకటి జరిగింది.
 
కర్నాటకలోని బెంగళూరులో మనోజ్, ఆర్తి అనే దంపతులు కారులో వెళ్తున్నారు. ఇంతలో బైకుపై వెళ్తున్న దర్శన్ అనే వ్యక్తి వెళ్తున్నాయి. ఈ క్రమంలో మనోజ్ వాళ్ల కారు సైడ్ మిర్రర్‌కి అనుకోకుండా బైకు తగిలింది. జస్ట్ సారీ చెప్పేసి బైకును ఆపకుండా అతడు వెళ్లిపోసాగాడు.
 
ఐతే తమ కారు సైడ్ మిర్రర్ ఢీకొట్టడమే కాకుండా వెళ్లిపోతున్నాడంటూ తీవ్ర ఆగ్రహంతో దంపతులు అతడిని కారుతో వెంటాడి వెనుక నుంచి ఢీకొట్టారు. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వారు మాత్రం అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?