Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌ నూతన ప్రైవసీ విధానం.. ఏకపక్షంగా రుద్దడం ఆందోళనకరం

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (13:47 IST)
వాట్సాప్‌ నూతన ప్రైవసీ విధానాన్ని ఎంచుకునే విషయంలో యూరోపియన్‌ యూజర్లతో పోలిస్తే భారత యూజర్ల పట్ల మెసేజింగ్‌ యాప్‌ భిన్నంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టుకు వివరించింది. భారత యూజర్లపై వాట్సాప్‌ తన ప్రైవసీ పాలసీలో మార్పును ఏకపక్షంగా రుద్దడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. 
 
ఫేస్‌బుక్‌ నేతృత్వంలోని వాట్సాప్‌ నూతన ప్రైవసీ విధానానికి వ్యతిరేకంగా ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ న్యాయమూర్తి సంజీవ్‌ సచ్‌దేవ్‌ ఎదుట ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
 
తమ డేటాను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో షేర్‌ చేయకుండా ఉండే అవకాశాన్ని భారత యూజర్లకు ఇవ్వకపోవడాన్ని శర్మ ఆక్షేపించారు. ఇది యూజర్ల సమాచార గోప్యత, సమాచార భద్రతకు భంగకరమని కోర్టుకు నివేదించారు. 
 
దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్థిష్ట సమాచారం అందచేయాలని వాట్సాప్‌ను కోరిందని తెలిపారు. ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మార్చి1కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments