Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెలికాం సంస్థలకు సుప్రీం కోర్టులో ఊరట.. 1.6లక్షల కోట్ల బకాయిలను..?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (15:46 IST)
సుప్రీం కోర్టులో టెలికాం సంస్థలకు ఊరట లభించింది. ప్రభుత్వానికి (DoT) చెల్లించాల్సి బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త డెడ్‌లైన్ విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. పదేళ్లలో ఏజీఆర్ బకాయిలను చెల్లించాలని పలు షరతులతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి సుమారు 1.6లక్షల కోట్ల బకాయిలను టెలికాం సంస్థలు చెల్లించాల్సి ఉంది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 
 
వచ్చే ఏడాది 2021 మార్చి 31 పదిశాతం బకాయిలను చెల్లించాలని.. పదేళ్లల్లో (2031 నాటికి) ఏడీఆర్ బకాయిలన్నీంటిని చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే బకాయిల చెల్లింపులపై టెలికాం ఎండీలు, సీఈవోలు నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రస్తుత బ్యాంకు గ్యారంటీలు యథాతధంగా కొనసాగుతాయని, వడ్డీ చెల్లింపుల వివరాలు ప్రతి సంవత్సరం అందించాలని పేర్కొంది. ఇన్‌స్టాల్‌మెంట్లు, ఏజీఆర్  బకాయిలు చెల్లిచడంలో కంపెనీలు విఫలమైతే జరిమానా, వడ్డీతోపాటు కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదవుతుందని హెచ్చరించింది. అయితే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో భారతి ఎయిర్‌టెల్, ఐడీయా, వొడాఫోన్ వంటి సంస్థలకు పెద్ద ఉపశమనం లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments