Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో పోటీని తట్టుకునేందుకు రూ.149కే అపరిమిత కాల్స్‌ : బీఎస్ఎన్ఎల్

దేశ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా రిలయన్స్ జియో తన టెలికాం సర్వీసులను ప్రారంభించిన తర్వాతే ఈ పోటీ నెలకొంది. జియో అందిస్తున్న సేవలతో కోట్లాది మంది మొబైల్ వినియోగదారులు తమ పాత నెట్‌వర్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (09:00 IST)
దేశ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా రిలయన్స్ జియో తన టెలికాం సర్వీసులను ప్రారంభించిన తర్వాతే ఈ పోటీ నెలకొంది. జియో అందిస్తున్న సేవలతో కోట్లాది మంది మొబైల్ వినియోగదారులు తమ పాత నెట్‌వర్క్‌లకు టాటా చెప్పి... జియో నెట్‌వర్క్‌కు మారిపోతున్నారు. దీంతో అన్ని టెలికాం కంపెనీలన్నీ ధరల విషయంలో దిగిరాక తప్పలేదు. ఇందులో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఉంది. 
 
ఇందులోభాగంగా ఈ సంస్థ రూ.149కే అపరిమిత ఉచిత వాయిస్‌ కాల్స్‌ను చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ఈ దిశగా తమ సంస్థ ఆలోచన చేస్తున్నట్టు ఆ కంపెనీ సీఎండీ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన భోపాల్‌లో మాట్లాడుతూ... అపరిమిత కాల్స్‌, పరిమిత డేటాను రూ.149, అంతకంటే తక్కువకే జనవరి నుంచీ అమలు చేసేందుకు యోచిస్తున్నామని తెలిపారు. 
 
జాతీయస్థాయిలో రోమింగ్‌ ఛార్జీలు లేకుండా ఉచిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ అనుమతించడంతోనే సంస్థకు చందాదార్లు పెరిగారని వెల్లడించారు. దేశంలోని మొత్తం చందాదార్ల సంఖ్యలో 10 శాతం తమకు ఉన్నారని, వీరిని 15 శాతానికి పెంచుకునేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments