Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీజీ.. ఆ యువకుల బలిదానాల సాక్షిగా చెపుతున్నా.. మీ భరతం పడతాం : పవన్ కళ్యాణ్

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామంటూ నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత మూడు రోజులుగా వివిధ అంశ

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (08:41 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామంటూ నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత మూడు రోజులుగా వివిధ అంశాలపై ట్విట్టర్‌లో వ్యాఖ్యానాలు చేస్తున్న పవన్‌ ఆదివారం రోజున ప్రత్యేక హోదాపై కామెంట్‌ చేశారు. 
 
ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రకటించిన ప్యాకేజీలో ప్రత్యేక అన్న పదం తప్ప వేరే ఏమీ లేదని ట్వీట్ చేశారు. ఆంధ్రులను ఆత్మాభిమానం, వెన్నెముక లేనివారిగా భారతీయ జనతాపార్టీ చూస్తోందని అన్నారు. 
 
‘జై ఆంధ్రా ఉద్యమంలో నాలుగు వందలకు పైగా యువకులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మరిచిపోరు. ఆ నాలుగు వందల మంది విద్యార్థులపై ప్రమాణం చేస్తున్నాం. ప్రత్యేక హోదాపై బీజేపీని వదిలేదు లేదు. వారిచ్చిన వాగ్దానంపై సమాధానం చెప్పకుండా బీజేపీని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు. 
 
ముఖ్యంగా.. ‘బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వెనక్కు వెళ్లింది. దశాబ్ధ కాలపు అవమానాల తర్వాత రాజధాని లేకుండానే, భారీ రెవెన్యూ లోటుతో ఆంధ్రులు గెంటివేతకు గురయ్యారు. స్పెషల్‌ కేటగిరి హోదా.. స్పెషల్‌ ప్యాకేజీగా మారిందని వ్యాఖ్యానించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments