Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ 5జీతో జియోకు షాక్? 2018 మార్చి నెలలో ముహూర్తం..?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ త్వరలో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 4జీతో రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. జియోకు చెక్ పెట్టే దిశగా బీఎస్ఎన్ఎల్ 5

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (13:38 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ త్వరలో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 4జీతో రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. జియోకు చెక్ పెట్టే దిశగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

జియో ఉచిత డేటా ఆఫర్‌లో టెలికాం సంస్థలన్నీ తీవ్ర నష్టాన్ని చవిచూసిన తరుణంలో.. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందించే దిశగా సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ చౌక ధరకే డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
 
బీఎస్ఎన్ఎల్  కూడా చౌక ధరలో డేటా ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. అయితే 3జీ సేవలకే పరిమితమైన బీఎస్ఎన్ఎల్.. ప్రస్తుతం 5జీ సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ 5జీ సేవల కోసం నోకియాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

2018 మార్చి నెలలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో రిలయన్స్ జియో షాక్‌కు గురైంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 90జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్‌‌ను రూ.429లకే అందించనుంది. రూ.8, రూ.19లకే చౌక కాల్ రేట్లతో కూడిన వౌచర్లను కూడా వినియోగదారులకు అందజేయనుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments