Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఫైబర్ కస్టమర్లకు కాంప్లిమెంటరీ గిఫ్ట్.. గోల్డ్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు..

Webdunia
బుధవారం, 8 జులై 2020 (20:56 IST)
జియో ఫైబర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. తమ యూజర్ల కోసం ఓ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చింది. లయన్స్ గేట్ ప్లే నుంచి ప్రీమియం కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పిస్తోంది. స్టార్ట్ ఒరిజినల్, ఫాస్ట్ రన్‌తో పాటు ఇతర టీవీ, సినిమా కంటెంట్.. పాపులర్ ప్రోగ్రామ్‌లను జియో ఫైబర్ వినియోగదారులు వీక్షించే సదుపాయం వుంటుంది. బుధవారం నుంచి ఈ గిఫ్ట్ అమలులోకి వచ్చింది. 
 
ఈ సదుపాయం హారర్, కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ, సినిమాల కంటెంట్ చూసేందుకు ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, భోజ్ పురి భాషల్లో ఈ వీడియోలను వీక్షించవచ్చు. ఈ కాంప్లిమెంటరీని జియో ఫైబర్ సిల్వర్ యూజర్లు వీక్షించవచ్చు. అలాగే, కొత్త వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో టీవీ ప్లస్ యాప్ నుంచి జియోఫైబర్ యూజర్లు లయన్స్ గేట్ ప్లే కంటెంట్ చూడవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా లాగిన్ లేదా యాప్ డౌన్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
 
ఇకపోతే.. ఎక్కువ కంటెంట్‌ను వీక్షించాలనుకునే జియోఫైబర్ యూజర్లు గోల్డ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ గోల్డ్ ప్లాన్‌లో హై స్పీడ్, ఎక్కువ బ్రాడ్ బ్యాండ్ డాటా లభిస్తుంది. గోల్డ్ ప్లాన్‌లో 250 ఎంబీపీఎస్ స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ (నెలకి 1750 జీబీ డేటా), భారత్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అంతర్జాతీయంగా తక్కువ ధరకే కాల్స్ అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments