Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోకో ఎమ్-2 ప్రోమో ఫోన్ విడుదల.. ధరెంతో తెలుసా?

Advertiesment
పోకో ఎమ్-2 ప్రోమో ఫోన్ విడుదల.. ధరెంతో తెలుసా?
, బుధవారం, 8 జులై 2020 (16:29 IST)
Poco M2 pro
పోకో సంస్థ నుంచి పోకో ఎమ్-2 ప్రోమో పేరిట కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. తద్వారా పోకో సంస్థ ఈ ఏడాది రెండో స్మార్ట్ ఫోనును భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లైంది. అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోను వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోనులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కవైపు అందించారు.
 
ఇంకా వెనకవైపు నాలుగు కెమెరాలు, కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ప్లస్ 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్‌లు ఉన్నాయి. ఫ్రన్ట్ సైడ్16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్‌గా ఉంది. 
 
పోకో ఎం2 ప్రో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 
* 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 
* 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999
* 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయిన జార్ఖండ్ సీఎం