Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూ వేల్ నిషేధంపై 3వారాల్లోపు నివేదిక సమర్పించాలి.. ఇదో జాతీయ సమస్య: సుప్రీం

వీడియో గేమ్‌లపై పిల్లలకున్న మక్కువను కొన్ని గేమ్‌లను రూపొందిస్తోన్న సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. అయితే ఆ గేమ్స్ ద్వారా చిన్నారులు మానసిక ఒత్తిడి గురవుతున్నారు. వీడియో గేమ్‌ల ద్వారా మెదడుకు దెబ్బేనన

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (17:43 IST)
వీడియో గేమ్‌లపై పిల్లలకున్న మక్కువను కొన్ని గేమ్‌లను రూపొందిస్తోన్న సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. అయితే ఆ గేమ్స్ ద్వారా చిన్నారులు మానసిక ఒత్తిడి గురవుతున్నారు. వీడియో గేమ్‌ల ద్వారా మెదడుకు దెబ్బేనని వైద్యులు హెచ్చరిస్తున్నా... ప్రాణాలను తీసే బ్లూ వేల్ తరహా వీడియో గేమ్‌లు వచ్చేశాయి. బ్లూ వేల్‌ గేమ్ కార‌ణంగా ఇప్ప‌టికీ ప్రపంచ‌వ్యాప్తంగా వంద మందికి మించిన టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇందుకు కారణం బ్లూవేల్ గేమ్‌లో వచ్చే టాస్క్‌లే. టాస్క్‌లు పూర్తి చేయకపోతే ఆత్మహత్య చేసుకోవాలనే ఆప్షన్ వుండటమేనని.. మృత్యువాత పడిన టీనేజర్ల తల్లిదండ్రులు రోదిస్తున్నారు. 50 రోజుల్లోగా ఇచ్చిన టాస్క్‌లు పూర్తిచేయాల‌ని చెప్పే ఈ గేమ్ చివ‌రి లెవె‌ల్లో త‌మ ద‌గ్గ‌రి వాళ్ల‌ను చంప‌డం గానీ, ఆత్మ‌హ‌త్య గానీ చేసుకోవాల‌ని ప్రేరేపిస్తుంది.

ఈ నేపథ్యంలో టీనేజ‌ర్ల ప్రాణాల‌ను బ‌లిగొంటున్న బ్లూ వేల్ స్మార్ట్‌ఫోన్ గేమ్‌ను భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం జాతీయ స‌మ‌స్య‌గా అభివ‌ర్ణించింది. దీంతో పాటు ఇత‌ర భ‌యంక‌ర గేమ్‌లైన ''చోకింగ్ గేమ్‌'', "ఐ బాల్ ఛాలెంజ్‌", ''సాల్ట్ అండ్ ద ఐస్ ఛాలెంజ్‌'', ''ఫైర్ ఛాలెంజ్‌'' వంటి గేమ్‌ల‌పై కూడా నియంత్ర‌ణ విధించాల‌ని సుప్రీంకోర్టు తెలిపింది. 
 
ముఖ్యంగా బ్లూవేల్ గేమ్‌ నిషేధానికి సంబంధించి మూడు వారాల్లోగా కేంద్రం నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా దూర‌ద‌ర్శ‌న్‌తో పాటు ఇత‌ర ప్రైవేటు టీవీ ఛాన‌ళ్లు కూడా ఈ ప్ర‌మాద‌క‌ర‌ గేమ్‌ విషయంలో అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చ‌డానికి కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేయాల‌ని ఆదేశించింది. ఈ గేమ్‌ను నియంత్రించేందుకు నిపుణులు అధ్యయనం చేస్తున్నారని.. వారు త్వరలో పరిష్కారాన్ని సూచిస్తారని కేంద్రం కోర్టుకు విన్నవించుకుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments