Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా అంటే ఖండమే కదా.. బూతు పదంలా యాపిల్ బ్లాక్ చేసిందా?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (14:43 IST)
ఆసియా అంటే ఖండం అని అందరూ సమాధానం చెప్తారు. అయితే యాపిల్ సంస్థకు మాత్రం ఆసియా అనే పదం ఎలా వినిపించిందేమో ఏమో కానీ... అదో పెద్ద బూతు పదంలా దాన్ని బ్లాక్ చేసేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది. యాపిల్ సంస్థ ఆసియా అన్నా.. ఆ పదంతో కలిపి వేరే పదాలున్నా బ్లాక్ చేసేస్తోంది.  
 
ఎలాగంటే.. ఐఫోన్, ఐప్యాడ్‌లోని సఫారీ బ్రౌజర్‌లో ఏషియన్ అని టైప్ చేస్తే.. బ్లాక్ చేసినట్టు ఓ సందేశం దర్శనమిస్తుంది. అంతేకాదు.. ఏషియన్ ఫుడ్ అని రాసినా, ఏషియన్ డైనాస్టీస్ అని పదం టైప్ చేసినా అదే పునరావృతం అవుతుంది. అంతెందుకు, హైదరాబాద్‌లో ఉన్న ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ గురించి తెలుసుకోవాలనుకున్నా ఐఫోన్ సఫారీలో కుదరదు. ఎందుకంటే అందులో ‘ఏషియన్’ ఉంది కాబట్టి. 
 
సఫారీలో రావట్లేదు కదా అని గూగుల్ క్రోమ్ లో టైప్ చేద్దామని చూస్తారా.. అక్కడా వెంటనే ఆ పదాలను బ్లాక్ చేస్తోంది యాపిల్. ఇందుకు కారణం.. కొత్తగా వచ్చిన ఐవోస్ 12 సాఫ్ట్‌వేర్‌లోని ‘కంటెంట్ ఫిల్టర్’ అనే ఓ కొత్త ఫీచరే. కంటెంట్ ఫిల్టర్‌లో కొన్ని పదాలపై ఆంక్షలు పెడితే.. ఆసియా అనే పదం ఉండే విషయాలూ బ్లాక్ అవుతున్నాయి. దీనిపై ఇప్పటిదాకా యాపిల్ సంస్థ స్పందించనూ లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments