సీతాఫలాలతో లక్ష్మీ పూజ చేయడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సీతాఫలంతో చేసిన వంటకాలు, సీతాఫలంతో లక్ష్మీపూజ చేసేవారికి దారిద్ర్యం తొలగి, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు. అలాగే లక్ష్మీదేవి విగ్రహం ముందు ఒక చిన్న గిన్నెలో (వెండిదైతే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి వుంచితే మంచిది. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా వుంటే ఇంకా మంచిది. విగ్రహాల పరిమితి పెద్దదిగా వుంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం తప్పనిసరిగా చేయాల్సి వుంటుంది.
వాస్తు ప్రకారం సీతాఫలం చెట్టును ఇంట్లో వుంచవచ్చా?
వాస్తు ప్రకారం సీతాఫలం చెట్టును ఇంట్లో పెంచకపోవడం మంచిది. ఒక వేళ ఇంటి ఆవరణలో వున్నట్లయితే దాన్ని తీసేయడం లేదా నరికి వేయడం కాకుండా ఉసిరి లేదా అశోకా మొక్కల్ని అదే పరిధిలో పెంచితే దోష నివారణ పూర్తిగా తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
సీతాఫలం ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వీటిని తినే వారికి గుండె సంబంధిత సమస్యలు వుండవు. సీతాఫలంలోని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లల ఎముకల పుష్టికి టానిక్‌లా పనిచేస్తుంది.