Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి యాపిల్.. తిరుపతికి తెచ్చేందుకు అమెరికా వెళ్లనున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రను పారిశ్రామికంగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియాను ఆంధ్రప్రదేశ్‌క

Webdunia
బుధవారం, 3 మే 2017 (11:11 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రను పారిశ్రామికంగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియాను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించారు. ఇదేవిధంగా అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ సంస్థ తన తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఫుల్ జోష్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు తాజాగా టెక్ దిగ్గజం యాపిల్‌పై దృష్టి సారించారు.
 
అందుకే చంద్రబాబు అమెరికా ట్రిప్పేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా యాపిల్‌ను తిరుపతికి తీసుకురావడమే లక్ష్యమని సమాచారం. ఇందులో భాగంగా యాపిల్ సీఈవోతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. గూగుల్ యాజమాన్యంతో కూడా చంద్రబాబు సమావేశమవుతారు. 
 
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఐటీ కంపెనీలను లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న మేథాటవర్స్‌లో ఏడు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ కొత్త కంపెనీల్లో స్పెయిన్‌కు చెందిన గ్రూపో అంటోలిన్, జర్మనీకి చెందిన ఐఈఎస్, ఎంఎన్సీ రోటోమేకర్, అమెరికాకు చెందిన మెస్లోవా, చందుసాఫ్ట్, ఈసీ సాఫ్ట్, యమైహ్ ఐటీ సొల్యూషన్స్ ఉన్నాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments