Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్ నుంచి ప్రైవేట్ ఫోటోలు లీక్ : రూ.36 కోట్ల అపరాధం చెల్లిచిన యాపిల్

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (11:33 IST)
ఐఫోన్ నుంచి ప్రైవేట్ ఫోటోలు లీక్ అయినందుకు రూ.36 కోట్ల అపరాధాన్ని యాపిల్ సంస్థ చెల్లించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని ఒరేగావ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని ఐఫోన్ పాడైపోవడంతో 2016లో పెగట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న ఐఫోన్ సర్వీస్ సెంటర్‌లో మరమ్మతు కోసం ఇచ్చింది.
 
ఫోన్‌ను మరమ్మతు చేసిన అక్కడి టెక్నీషియన్లు అందులో ఉన్న యువతి నగ్న ఫొటోలు, వీడియోలు చూసి వాటిని తస్కరించారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు చూసిన యువతి స్నేహితులు విషయాన్ని ఆమెకు చేరవేయడంతో దిగ్భ్రాంతికి గురైంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత యువతి కోర్టుకెక్కింది. 
 
పరిహారంగా 5 మిలియన్ డాలర్లు (రూ.36 కోట్లు) ఇప్పించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో యాపిల్ ఆ మొత్తాన్ని యువతికి పరిహారంగా చెల్లించింది. యాపిల్ చెల్లించిన ఈ సొమ్మును సర్వీస్ సెంటర్ పెగట్రాన్ నుంచి రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments