Webdunia - Bharat's app for daily news and videos

Install App

Apple Awas Yojana? యాపిల్ ఉద్యోగుల కోసం ఇళ్లు.. నిజమేనా?

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:23 IST)
ప్రముఖ యాపిల్ సంస్థ గడిచిన రెండున్నరేళ్లలో భారత్ లో 1.5 లక్షల మందిని తమ సంస్థలోకి తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా టెక్ దిగ్గజ కంపెనీ అయిన యాపిల్‌ తన ఉద్యోగులకు ఏకంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
 
ఇండస్ట్రీయల్‌ హౌజింగ్‌ మోడల్స్‌ పేరుతో ఇప్పటికే చైనా, వియత్నాం వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఇదే ఈ విధానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. భారత్ ఉద్యోగులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేలా యాపిల్ రంగం సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతితో "యాపిల్‌ ఆవాస్‌ యోజన" పేరుతో గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు టాక్ వస్తోంది. 
 
ఈ స్కీమ్ కింద దాదాపు 78,000 యూనిట్ల ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో గరిష్ఠంగా తమిళనాడులోనే 58,000 యూనిట్ల ఇళ్ల నిర్మాణం జరగనుంది. ఇక యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఈ స్కీమ్ ద్వారా ఎక్కువగా మహిళలకు లబ్ధి చేకూరనుంది. 
 
చాలామంది ఉద్యోగులు అద్దె గృహాల్లో ఉంటున్నారు. వారు ఆఫీస్‌లకు చేరుకోవడానికి చాలా సమయం ప్రయాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళ ఉద్యోగులు భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకే కంపెనీ ప్రొడక్షన్‌తో పాటు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు యాపిల్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments