Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది యాపిల్ క్రెడిట్ కార్డు.. వాచ్ సిరీస్ 3 ఎల్టీఈ విక్రయాలు ప్రారంభం

ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ శాక్స్ భాగస్వామ్యంతో స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ కార్డు తీసుకురానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఓ క్రెడిట్ కార్డును యాపిల్ తీసుకురానుంది

Apple
Webdunia
శనివారం, 12 మే 2018 (12:59 IST)
ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ శాక్స్ భాగస్వామ్యంతో స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ కార్డు తీసుకురానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఓ క్రెడిట్ కార్డును యాపిల్ తీసుకురానుంది. ఇందుకోసం గోల్డ్ మ్యాన్ ‌శాక్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆదాయం పొందే వ్యూహంలో భాగంగా క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతోంది.
 
అంతేగాకుండా యాపిల్ ఆదాయం పెరుగుతుందని.. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతుందని యాపిల్ భావిస్తోంది. ముఖ్యంగా భారత మార్కెట్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రకటించారు.
 
మరోవైపు యాపిల్ నుంచి వాచ్ సిరీస్ 3 ఎల్టీఈ విక్రయాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో యాపిల్ స్మార్ట్ వాచ్‌లను ఉచిత సిమ్ కార్డుతో స్వయంగా విక్రయాలు నిర్వహిస్తున్నాయి. యాపిల్ సిరీస్ 3 వాచ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 38ఎంఎం ప్రారంభ ధర రూ.39,080. 42ఎంఎం ధర రూ.41,120. వీటిని జియో డాట్ కామ్, ఎయిర్ టెల్ డాట్ ఇన్ వెబ్ సైట్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చునని యాపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments