Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 2జీబీ డేటా.. ఎయిర్‌టెల్ న్యూ ప్లాన్

దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన పోటీ కారణంగా అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా, జియో, ఎయిర్‌టెల్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జియో ఆఫ్లకు పోటీగా ఎయిర్‌టెల్

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (15:15 IST)
దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన పోటీ కారణంగా అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా, జియో, ఎయిర్‌టెల్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జియో ఆఫ్లకు పోటీగా ఎయిర్‌టెల్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందులోభాగంగా, తాజాగా మరో ఆఫర్‌ను ఎయిర్‌టెల్ ప్రకటించింది.
 
కేవలం రూ.149కే 28 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేసింది. అయితే, ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలోనే ఈ ప్లాన్ అమల్లోకి రాగా, త్వరలో అన్ని సర్కిళ్లలోకి రానుందని మార్కెట్ వర్గాల సమాచారం. గతంలో ఈ ధరకే కేవలం ప్రతి రోజూ ఒక జీబీ డేటానే ఆఫర్ చేస్తూ వచ్చిన విషయం తెల్సిందే. 
 
రిలయన్స్ జియో రూ.149 రీచార్జ్ చేసుకున్న వారికి ప్రతి రోజూ 1.5 జీబీ 4జీ డేటాను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. దీనికి పోటీగా ఎయిర్‌టెల్ ప్రతి రోజూ అదనంగా మరో అర జీబీ డేటాతో మొత్తం 2జీబీ డేటాతో కూడిన ప్లాన్‌ను తీసుకొచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల కస్టమర్లు చేజారిపోకుండా ఉంటారని, కొత్త కస్టమర్లను ఆకర్షించొచ్చని ఎయిర్‌టెల్ భావిస్తోంది. 
 
కాగా, దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో రెండేళ్ల క్రితమే మార్కెట్లోకి అడుగు పెట్టినప్పటికీ కస్టమర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ వెళుతోంది. దీంతో మార్కెట్లో టాప్ ప్లేయర్స్‌గా ఉన్న ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌పై గట్టి ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో పోటీ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆకర్షణీయ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments