ఎయిర్‌టెల్ రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్.. అపరిమిత కాల్స్

దేశీయ టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రిలయన్స్ జియో తన సేవలను ప్రారంభించిన తర్వాత ఈ ధరల పోటీ మరింత తారా స్థాయికి చేరిన విషయం తెల్సిందే.

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (16:32 IST)
దేశీయ టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రిలయన్స్ జియో తన సేవలను ప్రారంభించిన తర్వాత ఈ ధరల పోటీ మరింత తారా స్థాయికి చేరిన విషయం తెల్సిందే. అదేసమయంలో వినియోగదారులను ఆకర్షించడానికి, వారికున్న కస్టమర్లను కోల్పోకుండా ఉండటానికి ఆయా కంపెనీలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. 
 
ఈ కోవలో ప్రస్తుతం అందిస్తున్న ప్లాన్లలోనూ మార్పు చేస్తున్నాయి. ఇటీవలే, రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ 2018 ఆఫర్‌ పేరుతో ఇప్పటికే ఉన్న ప్లాన్లలోనే మార్పులు చేసింది.  తాజాగా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ.149 ప్లాన్‌ను మార్చింది.
 
మార్చిన ప్లాన్ ప్రకారం, రూ.149 రీచార్జ్‌పై అన్ని నెట్ వర్క్‌లకు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్.. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1జీబీ డాటాను ఇవ్వనుంది. కాలపరిమితి 28 రోజులుగా నిర్ణయించింది. గతంలో ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు మాత్రమే అపరిమిత కాలింగ్‌ సౌకర్యం ఉండేది. ఇపుడు అన్ని నెట్‌వర్క్‌లకు కల్పించింది. 
 
మరోవైపు, రిలయన్స్ జియో సైతం రూ.149 ప్లాన్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్.. రోజుకి 1జీబీ డాటాను అందజేస్తోంది. దీని కాలపరిమితి కూడా 28 రోజులే. ఎయిర్‌టెల్, జియో రెండూ 28 రోజుల కాలపరిమితితో రూ.149కే ప్లాన్ అందిస్తున్నప్పటికీ ఎయిర్‌టెల్ 28 రోజులకు కలిపి 1జీబీ డాటా ఇస్తుండగా.. రిలయన్స్ జియో రోజుకి 1జీబీ డాటా చొప్పున ఇస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments