Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ నుంచి చౌకగా నాలుగు కొత్త ప్లాన్లు

Webdunia
గురువారం, 7 జులై 2022 (17:03 IST)
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న ఎయిర్‌టెల్ తాజాగా నాలుగు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. అదీ కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చౌకకా ప్రవేశపెట్టింది.
 
తక్కువగా వినియోగించే చిన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ నాలుగు ప్లాన్లను తీసుకొచ్చింది. ఇందులో రూ.109, రూ.111, రూ.128, రూ.131 ఉన్నాయి. 
 
రూ.109 ప్లాన్...
ఈ కాల పరిమితి 30 రోజులు. ఇందులో 200 ఎంబీ డేటా లభిస్తుంది. అలాగే, రూ.99 టాక్ టైమ్ కూడా వర్తిస్తుంది. నెల రోజుల పాటు ఈ డేటా, టాక్ టైమ్ అందుబాటులో ఉంటాయి. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్‌లైన్‌కు చేరుకునేలా వాయిస్ కాల్స్‌కు చేసే ప్రతి సెకన్‌కు 2.5 పైసలు చొప్పున చార్జ్ చేస్తారు. ప్రతి లోకల్ ఎస్ఎంఎస్‌కు ఒక్క రూపాయి, నేషనల్ ఎస్ఎంఎస్‌కు రూ.1.44 చొప్పున వసూలు చేస్తారు. 
 
రూ.111 ప్లాన్... 
ఇది కూడా రూ.109 ప్లాన్ తరహాలోనే ఉంటుంది. కాకపోతే, ఇందులో రూ.109 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా, రూ.111 ప్లాన్ నెల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే, ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. 
 
రూ.128 ప్లాన్...
ఈ ప్లాన్ 30 రోజుల కాలపరిమితి. ఇందులో ప్రతి సెకనుకు 2.5 పైసలు చొప్పున కాల్ చార్జీ వసూలు చేస్తారు. ప్రతి వీడియో కాల్‌ సెకనుకు రూ.5 పైసలు చొప్పున వసూలు చేస్తారు. మొబైల్ డేటా ఒక ఎంబీకి 50 పైసలు చార్జ్ చేస్తారు. లోకల్‌ ఎస్ఎంఎస్‌కు ఒక్క రూపాయి, నేషనల్ ఎస్ఎంఎస్‌కు రూ.1.50 చొప్పున వసూలు చేస్తారు. 
 
రూ.131 ప్లాన్... 
ఈ ప్లాన్ గడువు నెల రోజులు. అంటే ప్రతి నెల ఒకటో తేదీన రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మిగిలిన చార్జీలన్నీ కూడా రూ.128 ప్లాన్ తరహాలోనే ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments