Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైఫ్ గుడ్ పేరుతో ఎల్టీ ఓలెడ్ కొత్త టీవీ

Advertiesment
lg life good tv
, గురువారం, 30 జూన్ 2022 (20:20 IST)
దేశంలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణ వస్తు ఉత్పత్తుల తయారీ కంపెనీలో ఒకటైన ఎల్జీ సంస్థ తాజాగా 'లైఫ్ గుడ్' పేరుతో ఓలెడ్-సి2 పేరుతో సరికొత్త టీవీని ఆవిష్కరించింది. అలాగే, టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్, డ్రయర్లను కూడా కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా తమిళనాడు రీజినల్ బిజినెస్ హెడ్ కేఎల్.మురళి మాట్లాడుతూ, తమ కస్టమర్ల జీవనశైలికి చైతన్యం కలిగించేలా అత్యుత్తమ ఉత్పత్తులను తయారు చేసి వారికి అందించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. 
 
ముఖ్యంగా తమ కస్టమర్ల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, ఉత్తేజకరమైనవిగా చేయడానికి ఏఐ ఆధారిత సాంకేతిక శ్రేణితో తాజాగా ఓలెడ్-సి2 టీవీని కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టినట్టు చెప్పారు. ఇందులో డాల్బీ విజన్ ఐక్యూ అండ్ డాల్బీ అట్మాస్ సిస్టమ్‌ను అమర్చినట్టు తెలిపారు. ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. 
 
ముఖ్యంగా ఏ9 జెన్ 5 ఏఐ ప్రాసెసర్ ఉండటం వల్ల విజువల్స్‌ను ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్ చేసుకుంటుందని తెలిపారు. దీని ధర రూ.1,89,990గా వెల్లడించారు. అలాగే, ఫ్రంట్, టాప్ లోడ్‌తో వాషింగ్ మెషిన్స్, డ్రయర్లను కూడా మార్కెట్‌లోకి తెచ్చినట్టు తెలిపారు. దీని ధర రూ.64,990గా ఉందని ఇది ప్లాటినం, బ్లాక్ వీసీఎం, మిడిల్ బ్లాక్ రంగుల్లో లభ్యమవుతుం దన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ - డిప్యూటీ సీఎంగా ఫడ్నవిస్