Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ ఇనాక్టివ్‌ ప్రీ-పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. 1జీబీ డేటా, ఉచిత ఇన్‌కమింగ్?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (13:02 IST)
భారతీ ఎయిర్‌టెల్ నెట్వర్క్ ఇనాక్టివ్‌గా వున్న ప్రీ-పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. వారికి మూడు రోజుల కాలవ్యవధితో 1జీబీ డేటా, ఉచిత ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్‌ను అందిస్తోంది. సుమారుగా నెల రోజులకు పైగా ఇనాక్టివ్‌గా వున్న యూజర్లు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. 
 
వారిలో ఎంపిక చేసిన కస్టమర్లకు ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌కు సంబంధించిన మెసేజ్‌లను పంపిస్తోంది. అయితే ఇనాక్టివ్‌గా ఉన్న యూజర్లందరికీ ఈ ఆఫర్‌ను అందిస్తుందా అనేది తెలియాల్సి వుంది. 
 
కాగా ఇనాక్టివ్ ప్రీపెయిడ్ యూజర్లు ఈ ఆఫర్ కింద 1జీబీ హై స్పీడ్ డేటా, ఉచిత కాల్స్ సదుపాయం పొందవచ్చు. అయితే 3 రోజుల సమయం అయిపోయేలోగా కస్టమర్లు రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో తమ నంబర్ అలాగే కొనసాగుతుంది. అన్‌లిమిటెడ్ ప్యాక్‌లను రీచార్జి చేసుకుంటే కస్టమర్లు మరిన్ని బెనిఫిట్స్ ను పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది.
 
ఇక రూ.48 ప్లాన్ కింద 3జీబీ డేటాను ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఉచితంగా పొందవచ్చు. ఇందులో ఎలాంటి కాల్స్ రావు. కేవలం డేటా మాత్రమే వస్తుంది. దీని వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments