Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులను తొలగించిన టెక్ మహీంద్రా : పనికిరాని వాళ్లను తీసేస్తాం... ఇన్ఫోసిస్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులు తల్లడిల్లుతున్నారు. దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగులను గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ సంస్థల్లో పని చేస

Webdunia
గురువారం, 11 మే 2017 (10:51 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులు తల్లడిల్లుతున్నారు. దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగులను గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరూ ఎవరికి ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ బాటలోనే ఇప్పుడు టెక్ మహీంద్ర కూడా అడుగువేసింది. 
 
ఈ ఒక్క నెలలోనే వెయ్యి మందికి ఈ సంస్థ ఉద్వాసన పలికింది. అయితే, ఇది రెగ్యులర్‌గా జరిగే పనేనని... పనితీరు ఆశించినంతగా లేని ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైన విషయమన్నారు. ప్రధానంగా 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులనే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. ఏదో ఒక కారణం చూపి వీరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. 
 
అలాగే, మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగుల్లో ప్రతిభ లేనివారిని తీసేయనున్నట్టు ప్రకటించింది. తమ సంస్థలో పనితీరు బాగాలేని టెకీలను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 'వరుసగా కొంతకాలంపాటు మంచి పనితీరు కనబరచనివారిపై చర్యలు తీసుకోనున్నాం. ఇందులో భాగంగా కొందరిని తొలగించే అవకాశమూ ఉంది' అని ఆ ప్రకటనలో స్పష్టంచేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు

బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ డాకూ మహరాజ్ - తాజా అప్ డేట్ !

ఆగమ్ బా యూట్యూబర్ గోల్డ్ ప్లే బటన్‌ను అన్ బాక్స్ చేసిన తరుణ్ భాస్కర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments