Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిషీ ఎక్కడున్నావ్‌! నీతో మాట్లాడకుంటే నిద్రపట్టదురా!.. నిషిత్‌తో నారాయణ చివరి మాటలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి పి.నారాయణకు కుమారుడి మృతివార్త లండన్ కాలమానం ప్రకారం అర్థరాత్రి తెలిసింది. ఈ వార్త తెలియగానే ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అ

Webdunia
గురువారం, 11 మే 2017 (10:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి పి.నారాయణకు కుమారుడి మృతివార్త లండన్ కాలమానం ప్రకారం అర్థరాత్రి తెలిసింది. ఈ వార్త తెలియగానే ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అంతకుముందు.. తన కుమారుడితో ఫోనులో మాట్లాడి జాగ్రత్తలు కూడా చెప్పారు మంత్రి నారాయణ. 
 
భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నిషిత్‌కు మంత్రి నారాయణ ఫోన్ చేసి... 'నాన్నా.. నిషి ఎక్కడున్నావ్‌. జాగ్రత్తగా ఇంటికి వెళ్లు కన్నా!.. నీతో మాట్లాడకుంటే నిద్రపట్టదురా' అని నిషిత్‌తో అన్నారు. లండన్‌లో అధికారిక పర్యటనలో బిజీబిజీగా ఉన్నప్పటికీ.. తన కుమారుడితో రోజుకు ఒక్కసారైనా మాట్లాడేవారు. 
 
ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున నిషిత్‌ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. నిషిత్‌ మరణ వార్త ఉదయం 5 గంటలకు నారాయణ విద్యా సంస్థల జనరల్‌ మేనేజర్‌ వేమిరెడ్డి విజయభాస్కర్‌ రెడ్డికి చేరింది. అయితే ఈ విషయాన్ని లండన్‌లో ఉన్న మంత్రి నారాయణకు ఎలా చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు లండన్‌లో సమయం అర్థరాత్రి రాత్రి 2 గంటలు ఉంటుంది.
 
ముందు మంత్రి వెంట వెళ్లిన ఇద్దరు అధికారులకు ఫోన్లు చేసినా వారు లిఫ్ట్‌ చేయలేదు. ఆ తర్వాత నారాయణకు చేసినా... మంచి నిద్రలో ఉండటం వల్ల కావొచ్చు, ఆయన కూడా ఫోన్‌ తీసుకోలేకపోయారు. కొద్దిసేపటికి ఓఎస్‌డీ పెంచల రెడ్డి నుంచి కాల్‌ ఉండటంతో... నారాయణ తిరిగి ఫోన్‌ చేశారు. అప్పటికే విజయభాస్కర్‌ రెడ్డిని కూడా టెలీకాన్ఫరెన్స్‌లో తీసుకుని ఓఎస్‌డీ మంత్రి నారాయణతో మాట్లాడారు. 'సార్‌.. రోడ్డు ప్రమాదంలో నిషిత్‌ బాబుకు గాయాలయ్యాయి. మీరు వెంటనే బయల్దేరి భారత్‌కు రావాలి' అని చెప్పాను. 
 
వెంటనే బయలుదేరి రావాలని చెప్పడంతోనే హతాశులైన మంత్రి నారాయణ.. టీవీ పెట్టుకుని చూశాడు. టీవీలో వస్తున్న వార్తలు చూసి ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తేరుకుని కొంతమంది అధికారులతో కలిసి లండన్ నుంచి చెన్నైకు, చెన్నై నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరుకు చేరుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments