5జీ టెక్నాలజీతో కరోనా వైరస్ వస్తుందా?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:56 IST)
5జీ టెక్నాలజీతో మొబైల్ ఇంటర్నెట్ సేవలు వేగంగా అందుతాయి. అయితే ఈ మధ్య వుహాన్ నగరంలో 5జీ సేవలు స్టార్ట్ చేశారు. అయితే అప్పటి నుంచే అక్కడ కరోనా వైరస్ కేసులు ఎక్కువైనట్లు పుకార్లు వచ్చాయి. 5జీతో వైరస్ వ్యాప్తిస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రభుత్వం వెల్లడించింది. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఫేక్ వార్తలను ఖండిస్తున్నారు. 
 
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తీరు అందరినీ భయాందోళనకు గురిచేస్తోన్న నేపథ్యంలో.. ఆ టెన్షన్ కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ ఇప్పుడు బ్రిటన్‌లోనూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. 5జీ టెలికాం సేవల వల్లే కరోనా వైరస్ సోకుతున్నట్లు అక్కడ వదంతులు వ్యాపిస్తున్నాయి. 
 
ఆన్‌లైన్‌లో చెలరేగిపోతున్న ఆ ఫేక్ న్యూస్‌తో జనం హైరానాపడుతున్నారు. ఆ భయంలో 5జీ టవర్లను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్‌లో అయిదారు టవర్లకు నిప్పుపెట్టారు. అగ్నిప్రమాద ఘటనలపై పోలీసులు ఆరా తీస్తే ఈ విషయం బయటకు వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం.. భద్రత ఎక్కడ ఉన్నాయి? (video)

Samantha: మహిళా సూపర్ స్టార్లు రావాలంటే నిర్మాతలు ముందుకు రావాలి : సమంత రూత్ ప్రభు

Vishal: శివ చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను : విశాల్

Virat Karna: చలికి శరీరం ఫ్రీజ్ అయింది - నాగసాధు మేకప్ కి ఆరు గంటలు పట్టేది.: విరాట్ కర్ణ

Brahmanandam: హ్యాంగ్‌మెన్ లాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం :డా. బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments