ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్.. రికీ పాంటింగ్ కామెంట్స్ వెనుక?

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (15:33 IST)
Rishabh Pant_Ricky Ponting
ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ మొత్తం ఐపిఎల్ ఆడతాడని నమ్మకంగా ఉన్నానని చెప్పాడు. డిసెంబరు, 2022లో పంత్ కారు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఆ ప్రమాదం నుంచి ఏర్పడిన తీవ్రగాయాల నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం పూర్తిగా ఆడగలడనే స్థాయికి పంత్ ఆరోగ్య పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో "రిషబ్ చాలా నమ్మకంగా వున్నాడని, ఏ హోదాలో ఆడుతాడనే మాత్రం కచ్చితంగా తెలిదని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. అన్ని ఆటలు కాకపోయినా, రిపబ్ పంత్ 14 మ్యాచ్‌ల్లో పది మ్యాచ్‌లైనా ఆడుతాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. జట్టుకు కెప్టెన్‌గా పంత్ లేకపోవడం గత ఏడాది లోటును మిగిల్చింది. ప్రతి గేమ్‌ను ఆడుతానని పంత్ స్పష్టంగా చెప్తున్నాడు. నెంబర్ 4లో బ్యాటింగ్ చేస్తానంటున్నాడు. అతను చాలా డైనమిక్ ఆటగాడు. అతను స్పష్టంగా మా కెప్టెన్... రోడ్డు ప్రమాదం ఘటన నుంచి బయటపడటం అదృష్టం అనే చెప్పాలంటూ" రికీ వ్యాఖ్యానించాడు. రికీ కామెంట్స్ ప్రకారం పంత్ కెప్టెన్సీ ద్వారా మళ్లీ ఐపీఎల్ లోకి వచ్చే ఛాన్సుందని క్రీడా పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

తర్వాతి కథనం
Show comments