Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిషబ్ పంత్‌ను రూ.1.6కోట్లు మోసం చేసిన మృనాంగ్ సింగ్.. ఇతనెవరు?

Advertiesment
rishabh panth
, గురువారం, 28 డిశెంబరు 2023 (19:53 IST)
25 ఏళ్ల మృనాంక్ సింగ్.. గతంలో హర్యానా తరఫున అండర్-19 క్రికెట్ ఆడాడు. అయితే లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఈ యువకుడు స్టార్ హోటళ్లు సహా పలువుర్ని మోసం చేశాడు. వీడి బారిన పడి మోసపోయిన వారి జాబితాలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ సైతం ఉన్నాడు. పంత్‌ను ఏకంగా రూ.1.6 కోట్ల మేర ఇతడు మోసం చేశాడు.
 
యువకుడు క్రికెటర్‌గా నటించి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డాడు. హర్యానాకు చెందిన 25 ఏళ్ల యువకుడు.. గతంలో అండర్-19 క్రికెటర్‌గా కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఈజీ మనీకి అలవాటు పడి ఎన్నో లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లను మోసం చేయడమే కాకుండా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను కూడా కోట్లకు పడగలెత్తాడు. 
 
మృనాంక్ సింగ్ అనే వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మోసానికి పాల్పడ్డాడు. ఖరీదైన రెస్టారెంట్లలో తింటూ.. ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయాలనుకున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మహిళలను మోసం చేయడానికి ముంబై ఇండియన్స్ జట్టులో భాగమన్నాడు.
 
ఖరీదైన రెస్టారెంట్లలో తింటూ బిల్లులు కట్టకుండా ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసేవాడు. 2022లో మృనాంక్ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేశారు. అనంతరం రూ.5.5 లక్షల బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయాడు. సార్ బిల్లు కట్టవద్దని సిబ్బంది అడగడంతో అడిడాస్ వారు బిల్లు చెల్లిస్తామని చెప్పి వారి వద్ద నుంచి బ్యాంకు వివరాలు తీసుకుని వెళ్లిపోయారు. 
 
బకాయిలు చెల్లించడానికి హోటల్‌లో అతనిని చాలాసార్లు సంప్రదించడానికి ప్రయత్నించారు. కాని అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించి ఫోన్ ఆఫ్ చేశాడు. తాను దుబాయ్‌లో స్థిరపడ్డానని చెప్పి వారిని నమ్మించాడు. అతడిపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఏడాది తర్వాత డిసెంబరు 25న హాంకాంగ్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకప్ కోసం చాలా సేపు కుర్చీలో కూర్చోవడం బోరింగ్.. ధోనీ