Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేకప్ కోసం చాలా సేపు కుర్చీలో కూర్చోవడం బోరింగ్.. ధోనీ

Advertiesment
Dhoni
, గురువారం, 28 డిశెంబరు 2023 (19:33 IST)
Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన ఆటతీరు, సరళతతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ మరో స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ధోనీ హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  
 
తాజాగా ధోనీ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చాలా స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. కొత్త హెయిర్ స్టైల్‌తో విభిన్నంగా కనిపిస్తున్నాడు. టార్జాన్‌ తరహా హెయిర్‌స్టైల్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ధోనీ ఇప్పుడు అలాంటి హెయిర్‌స్టైల్‌తో దర్శనమిస్తున్నాడు. ఓ యాడ్ షూట్ కోసం ధోనీ జుట్టు పెంచుకున్నాడు. అయితే తాజాగా తన హెయిర్ స్టైల్ వల్ల ఎదురయ్యే సమస్యల గురించి మిస్టర్ కూల్ ఓపెన్ అయ్యాడు.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధోనీ తన హెయిర్ స్టైల్ గురించి మాట్లాడాడు. కానీ పొడవాటి జుట్టు కారణంగా ప్రకటనల షూటింగ్‌కి సిద్ధం కావడం ఆలస్యమైంది. ఇంతకుముందు మేకప్ 20 నిమిషాల్లో చేసేవారు. కానీ ఇప్పుడు సిద్ధం కావడానికి గంటా ఐదు నిమిషాల నుంచి గంట పది నిమిషాలు పడుతుంది. 
 
మేకప్ కోసం చాలా సేపు కుర్చీలో కూర్చోవడం బోరింగ్‌గా అనిపిస్తుంది. అయితే నా అభిమానులంతా హెయిర్ స్టైల్ బాగుందని అంటున్నారు. అటువంటి జుట్టును నిర్వహించడం అంత సులభం కాదు. అభిమానుల కోసం కొంత కాలం ఇలాగే ఉండేలా ప్రయత్నిస్తాను. మంచిరోజున కట్‌ చేస్తానన్నాడు. ప్రస్తుతం ధోనీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మైదానంలో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ధోని ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాక్సింగ్ డే టెస్టు.. ప్రేమికులను అలా వీడియో తీసిన కెమెరా మ్యాన్