భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన రికార్డులు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. టీమిండియాకు చెందిన యంగ్ క్రికెటర్లు ఒక్కొక్కరు ఈ రికార్డులను అధికమిస్తున్నారు. దీంతో ధోనీ చేసిన రికార్డులన్నీ ఒక్కొక్కటిగా చెదిరిపోతున్నాయి.
ప్రస్తుతం క్యాలెండర్ ఇయర్ 2023లో వన్డే ఫార్మెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ 14 యేళ్ల తర్వాత నిలిచాడు.
పైగా, ఈ తరహా రికార్డును సొంతం చేసుకున్న రెండో వికెట్ కీపర్‌గా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య జట్టుతో గురువారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను రాహుల్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేసిన ఔట్ అయిన రాహుల్.. ప్రస్తుతం క్యాలెండర్ యేడాది 2023లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో దాదాపు 14 యేళ్ల తర్వాత వన్డే ఫార్మెట్‌లో ఒక క్యాలెడర్ యేడాదిలో 1000 పరుగులు సాధించిన తొలి భారతీయ వికెట్ కీపర్‌గా రాహుల్ నిలిచాడు. ఇతడి కంటే ముందు భారత మాజీ దిగ్గజం ధోనీ పేరిట ఈ రికార్డు ఉంది.
వన్డేల్లో ఒక యేడాది వెయ్యి పరుగులు సాధించిన తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా మహీ రికార్డు సృష్టించాడు. దాదాపు 14 యేళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీట్‌ను సాధించిన వికెట్ కీపర్ రాహుల్ కావడం గమనార్హం.