Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాక్స్‌వెల్‌కు డిమాండ్ తగ్గలేదుగా.. వామ్మో వేలంలో రూ.14.25 కోట్లు పలికాడు..

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (15:44 IST)
Glenn Maxwell
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. గత సీజన్‌లో అతనికి పది కోట్లు ఇచ్చినా పంజాబ్ తరఫున దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీ మొత్తంలో కనీసం ఒక్క సిక్స్ కూడా బాదలేదు. దీంతో ఆ టీమ్ అతన్ని వదిలేసింది. 
 
కానీ ఈసారి రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతని కోసం బెంగళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి బెంగళూరే అతన్ని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది.
 
ఇకపోతే.. ఐపీఎల్ సీజన్ 14 మినీ వేలానికి మినీ వేలం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి ఐపీఎల్ కు మొత్తంగా 1,114 మంది ప్లేయర్లు పేరు రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీల విజ్ఞాప్తి మేరకు 292 మంది ఆటగాళ్లను ఫైనల్ చేసింది బీసీసీఐ. 
 
వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఐపీఎల్ లో 8 జట్లు పోటీపడనున్నాయి. గత నెలలో అత్యధికంగా 10 మందిని బెంగళూరు రిలీజ్ చేసింది.

సంబంధిత వార్తలు

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

తర్వాతి కథనం
Show comments