Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పరుగుల సునామీ...

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (09:44 IST)
Yashasvi Jaiswal
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2023 టోర్నీలో రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారించాడు. గురువారం రాత్రి కోల్‌‍కతా నైట్ రైడర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఆగిపోయాడు. జైస్వాల్ వీరవిహారంతో రాజస్థాన్ జట్టు అలవోకగా మరుపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టులో బ్యాటర్ జైస్వాల్... తొలి ఓవర్ నుంచి తన ప్రతాపం చూపించాడు. నితీశ్ రాణా వేసిన తొలి ఓవర్‌లోనే 6,6,4,4,2,4 బాది 26 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్‌ చివరి రెండు బంతులను బౌండరీకి తరలించాడు. శర్దూల్ ఠాకూర్ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత బంతికి ఒక్క పరుగు తీసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్థ శతకాన్ని నమోదు చేశాడు.

చివరకు 47 బంతుల్లో 98 పరుగుుల చేసిన నాటౌట్‌గా నిలిచాడు. కేవలం 13 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడంటే జైస్వాల్ బ్యాటింగ్ తీరు ఏ విధంగా సాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 8 సిక్స్‌లు, 16 బంతుల్లో 124 పరుగులు చేసిన జైస్వాల్.. ఇపుడు మరోమారు బ్యాట్‌తో వీరవిహారం చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే కావడం గమనార్హం. అంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. గత 2018లో 14 బంతుల్లోను, 2022లో పాట్ కమిన్స్ 14 బంతుల్లో అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments