Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : మరుపురాని విజయాన్ని అందుకున్న రాజస్థాన్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (09:23 IST)
Rajasthan Royals
ఐపీఎల్ 2023 టోర్నీలో భాగంగా, గురువారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎట్టకేలకు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తద్వారా ప్లే ఆఫ్స్‌కు అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది. గత మూడు మ్యాచ్‌లలో వరుస ఓటములను మూటగట్టుకున్న రాజస్థాన్ రాయల్స్.. గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయింది.

తొలుత బంతితో అదరగొట్టి ప్రత్యర్థి జట్టుని కేవలం ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ ఆటగాళ్లు బ్యాట్‌తోనూ రాణించారు. 149 పరుగుల లక్ష్య ఛేదన కోసంబరిలోకి దిగిన రాజస్థాన్.. లక్ష్యఛేదనలోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

ఆ జట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 13 ఫోర్లు, ఐదు సిక్స్‌లో సాయంతో రెచ్చిపోయి 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అలాగే, మరో బ్యాటర్ సంజూ శాంసన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 48 పరుగులు చేశాడు. దీంతో 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి అలవోకగా ఛేదించి మరుపురాని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా బ్యాటర్లు.. వెంకటేశ్ అయ్యర్ 57 పరుగులు చేయగా, నితీశ్ రాణా 22, రెహ్మనుల్లా గుర్భాజ్ 18, రింకు సింగ్ 16, జేసన్ రాయ్ 10, రస్సెల్ 10 చొప్పున పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ రెండు, సందీప్ శర్మ, ఆసిఫ్ తలో వికెట్ చొప్పున తీశారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments