Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్‌లో తప్పకుండా జరుగుతుందా? 100%?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (13:09 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వెంటాడుతూ వున్నప్పటికీ.. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ ఐపీఎల్ 13వ సీజన్ లేకుండా ముగించబోమని ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందని తెలుస్తోంది. అయితే అక్టోబర్ వరకు భారత్‌లో పరిస్థితిని బట్టి బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. పరిస్థితి మెరుగు పడితే భారత్‌లోనే ఐపీఎల్ జరుగుతుంది. 
 
అలా కాకుంటే దుబాయ్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఈ విషయంపై బీసీసీఐ చాలా స్పష్టతతో ఉంది. ఇక ఐపీఎల్ అక్టోబర్‌లో జరిగితే అప్పటికప్పుడు షెడ్యూల్ వేసుకోవడం కుదరదు కాబట్టి.. ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఫిక్స్ చేసి పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే భారత్‌లో కుదరకపోతే టోర్నీ 100 శాతం దుబాయ్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది.
 
మరోవైపు బీసీసీఐ పలు దేశవాళీ క్రికెట్ టోర్నీలను కూడా రద్దు చేసింది. డిసెంబర్ వరకు దేశవాళీ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దేశంలో భిన్న ఏజ్ గ్రూపుల్లో మొత్తం 38 దేశవాళీ టీంలు పలు టోర్నీల్లో మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. కానీ ఇవన్నీ కరోనా కారణంగా రద్దు అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments