Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ-20 వరల్డ్ కప్ జరుగుతుందా? మినీ ఐపీఎల్‌కు రంగం సిద్ధం? (video)

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (14:17 IST)
కరోనా వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా పోటీలు రద్దు అయిన నేపథ్యంలో కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుందా? లేదా అనేది సందిగ్ధంలో పడింది. అంతేగాకుండా.. ట్వంటీ-20 ప్రపంచ కప్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ-20 ప్రపంచ కప్‌ జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి వుంది. 
 
ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఈ ఈవెంట్‌పై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టోర్నీని నిర్వహించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని టీ20 వరల్డ్ కప్ రద్దు లేక వాయిదా పడితే… ఆ విండోను ఐపీఎల్ కోసం ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
 
దాదాపు మూడు వారాల సమయం ఉంటుంది కాబట్టి లీగ్ మొత్తం లేక మినీ ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. ‘ప్రస్తుతం చాలా దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఆస్ట్రేలియాలో అయితే ఆరునెలల పాటు లాక్ డౌన్ ఉంటుందని చెబుతున్నారు. 
 
ఇలాంటి పరిస్థితిలో ఐపీఎల్‌కు అక్టోబర్, నవంబర్ విండో సేఫ్ అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి టోర్నీని రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేస్తే ఐపీఎల్ టోర్నీ అక్టోబరులో జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీ20 వరల్డ్ కప్ను ఐసీసీ వాయిదా వేస్తే.. ప్రస్తుత ఎఫ్టీపీ ప్రకారం తిరిగి 2022లోనే జరిపే అవకాశం ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

తర్వాతి కథనం
Show comments